సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదివాసీలను అన్ని రకాలుగా ఆదుకుంటాం…
-కంది శ్రీనివాస రెడ్డి
ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దీపావళి పండగకి ముందు ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే దండారి సంబరాలు ఆదివాసుల సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో మామిడి గోడి, దహెగూడ, మొలాల్ గూడ, లొహార, సలాయి తాండ, సాలెగూడ, కొలామ్ తిప్ప, దార్లొద్ది, తిప్ప, ఖండాల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు… ఆయన్ను డప్పుచప్పుళ్లు, ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కంది శ్రీనివాస్ రెడ్డి ఆదివాసీలందరికి పండగ శుభాకాంక్షలు తెలిపి, నూతన వస్త్రాలు పంపిణీ చేసారు. తాను ఓడిపోయినా ప్రజల మద్యే ఉంటానని ఆయన అన్నారు. గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ఆదివాసులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం తో పాటు ప్రభుత్వ పథకాలు ఆదివాసీలందరికీ అందిస్తామన్నారు .ఇంఛార్జి మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం ప్రతీయేడు దండారికి రూ. 15 వేలు ఇస్తుందన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ అందిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు పదేళ్లలో చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లో చేసిందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, సుధాకర్ గౌడ్ , ఎంఏ షకీల్, అడ్డి భోజారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.