సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ఖానాపూర్లో సంబరాలు
ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలు చేపట్టారు. ఈసందర్బంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఎన్టీఆర్ చౌక్ వద్ద ఎన్టీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభిమాన సంఘం అధ్యక్షులు కొండ జి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, జన్నారం మండలం ప్రచార కార్యదర్శి ఉప్పుల విజయ్ కుమార్, నిర్మల్ బి. కిషన్, బింగి గంగరాజు, గుండంపల్లి, ఎన్టీఆర్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.