Khanapur: ఖానాపూర్ లో రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

సిరా న్యూస్,ఖానాపూర్
ఖానాపూర్ లో రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామంలో గల రేణుక ఎల్లమ్మ ఆలయంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చోరీకి పాల్ప‌డ్డారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి రేణుక ఎల్లమ్మ ఆలయంలో గుర్తు తెలియని దొంగలు ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి విగ్రహానికి ఉన్న వెండి కిరీటం, రెండు మంగళ సూత్రాలు, బొట్టు బిల్లలు, హుండీని దొంగ‌లించారు. దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేర‌కు పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *