సిరా న్యూస్,ఉట్నూర్;
నాగపూర్ భారీ బహిరంగ సభకు ఖానాపూర్ నియోజవర్గం నుండి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున గురువారం తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ పెద్దల ఆదేశాలను పాటిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సామాన్య కార్యకర్తగా ఆర్టీసీ బస్సులో నాగ్ పూర్ సభకు బయలుదేరారు.ఇలా చేయడం పట్ల కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు