సిరా న్యూస్,రంగారెడ్డి;
అత్తాపూర్ హసన్ నగర్ లో ఇంటి యజమాని ఆద్దే కట్టలేదని దాష్టీకం చూపించాడు. ఇంటి అధ్దె కట్టలేదని యువతి పై కత్తి తో దాడి చేసాడు. ఆమె చేతికి, తలకు కత్తి పోట్లు తగిలాయి. తీవ్ర గాయాల పాలైన యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ఓ కుటుంబం ఇంటి అద్దె చెల్లించడంలేదు. ఇంటి అద్దె చెల్లించాలని యజమాని అడిగాడు. అద్దె చెల్లించకపోవడంతో పాటు యజమాని పై దురుసు ప్రవర్తన చేసారని అతని ఆరోపణ. కరెంటు కట్ చేసాడు. దాంతో ఇద్దరి మద్య ఘర్షణ జరిగింది. అద్దెకున్న కుటుంబం యజమాని పై దాడికి యత్నించింది. కోపంతో అద్దెకు ఉంటున్న కుటుంబ పై యజమాని కుటుంబం. కత్తి తో దాడి చేసింది. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.