సిరా న్యూస్, చిగురుమామిడి
డాక్టరేట్ పట్టా పొందిన కొంకట అనూష-నరేష్ దంపతులకు ఘన సన్మానం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవలి డాక్టరేట్ పట్టా పొందిన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కొంకట అనూష- నరేష్ దంపతులు మొదటిసారిగా గ్రామానికి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం, మాదిగ జాగృతి సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.శాలువా పుష్పగుచ్చం అందించి సన్మానించారు.అంబేద్కర్, రమాబాయి, మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి పూలే ఫోటోలను వారికి బహుకరించారు.ఆమె ఎలక్ట్రానిక్స్ అగ్రికల్చర్ లో పిహెచ్డి పట్టా పొందారు.ప్రస్తుతం ఆమె టిడబ్ల్యూడిసి లో డిగ్రీ అధ్యాపకురాలుగా పని చేస్తున్నారు. తల్లిదండ్రులు భర్త ప్రోత్సాహంతో డాక్టరేట్ పట్టా పొందానని అనూష తెలిపారు. డాక్టరేట్ పట్టా పొందడం పట్ల గ్రామస్తులు పలువురు వారిని అభినందించారు. కార్యక్రమంలో మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొంకట వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ కత్తుల రమేష్ యాదవ్, కొంకట రాజయ్య, రామ, ఎంజీఎస్ నాయకులు జంగం అంజన్ బాబు, బెజ్జంకి రవీందర్, సురేష్, తాళ్ల నరేష్, కొంకట శ్రీకాంత్, వినయ్, హరీష్, లక్ష్మణ్ , వివేక్ తదితరులు పాల్గొన్నారు.