kota (k): కోట‌(కె)లో ఘనంగా గౌరీ మహా లక్ష్మి పూజలు

సిరాన్యూస్, బోథ్‌
కోట‌(కె)లో ఘనంగా గౌరీ మహా లక్ష్మి పూజలు

మరాఠీ సాంప్రదాయంలో గౌరీ మహాలక్ష్మి పూజను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కోట (కె) గ్రామంలోఘనంగా నిర్వహించారు. మహాలక్ష్మి వేడుకలను వినాయక చవితి ప్రారంభ‌మై 3వ రోజు నుండి తదుపరి 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ మహా లక్ష్మి పూజ జరుపుకోవాలనుకునేవారు మహాలక్ష్మి విగ్రహాలను బందువుల దగ్గర నుండి తీసుకుంటారు.వారే నేరుగా కొనుక్కొని ఈ పూజ చేయకూడదని పెద్దలు చెబుతారు.
మొదటి రోజు గౌరీ ఆహ్వానం :
భాద్రపద ( సెప్టెంబర్) నెలలో సప్తమి రోజున అనురాధ నక్షత్రంలో అమ్మ వారి ముఖము కలిగిన విగ్రహాలను చాటలో పెట్టీ పూజిస్తారు.మొదటి రోజు నుండి నవధాన్యాల పై కలుషం పెట్టీ విసర్జనం (అనగా నిమజ్జనం) వరకు ఉంచుతారు.
రెండవ రోజు గౌరీ పూజ :
భాద్రపద నెలలో అష్టమి రోజున జేష్ఠ నక్షత్రంలోఇంట్లో గర్బగుడిగా మండప రూపంలో అద్భుతంగా అలంకరించి, అమ్మ వారి విగ్రహాలను స్టాండు పైన పెట్టీ కొత్త వస్త్రాలతో చీర,మెడలో మంగళసూత్రం,చెవిలో రింగులు,అనేక రకాల అభరణలతో అమ్మ వారిని పూర్తి రూపంలో ప్రతిష్టాప‌న‌ చేసి పూజిస్తారు .అమ్మ వారి సంతాన రూపంలో అడ, మగా ఇద్దరు పిల్లల్ని పూజిస్తారు
అమ్మ వారి మండపంలో ఐదు రకాల ధాన్యపు రాశులను పోస్తారు. పదహారు రకాల కూరగాయల మిశ్రమముతో కూర చేస్తారు.పదహారు రకాలపిండితో దీపాలను తయారు చేసి వాటిని నెయ్యి తో వెలిగిస్తారు. బూరెలను నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
మూడవ రోజు నిమజ్జనం కార్యక్రమం :
అమ్మ వారిని బ్రహ్మ ముహూర్తంలో పదహారు దారపు చుట్లను కంకణంగా చుట్టి పదహారు ముడులువేసి,పదకొండు దారపు చుట్లను చుట్టి పదకొండు ముడులు వేసి ఆ మాలలను అమ్మవారి మెడలో వేస్తారు.అదేవిధంగా సంతానం కొరకు తొమ్మిది లేదా పదకొండు దారపు చట్లను చుట్టి తొమ్మిది లేదా పదకొండు ముడులు వేస్తారు.మహిళమణులకు కుంకుమతో ఆహ్వానం పలికి వారి పాదాలకు పసుపు రాసి ప్రసాదాన్ని పంచిపెడతారు.ఈ విధంగా చేస్తే ధనప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *