కృష్ణయ్య దారెటు…

సిరా న్యూస్,హైదరాబాద్;
రాజ్యసభ సభ్యత్వానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు. నిన్న ఆర్.కృష్ణయ్య రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపగా, దాన్ని ఛైర్మన్‌ ఆమోదించారు. వైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారుతన పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావుతో పాటు మోపిదేవి వెంకటరమణ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకే రాజీనామా చేసినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని విస్తరించడంపై ఆర్.కృష్ణయ్య దృష్టిపెట్టారు.కాగా, ఆర్.కృష్ణయ్య త్వరలోనే బీజేపీలో చేరతారని ఇటీవల ప్రచారం జరిగింది. తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకును మరింత పెంచుకునే దిశగా బీజేపీ దృష్టి సారించింది. దీంతో ఆర్.కృష్ణయ్యతో బీజేపీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.బీజేపీలో ఆర్.కృష్ణయ్యకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్‌ఎస్ఎస్‌లోనూ కృష్ణయ్య పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *