పాదయాత్రకు సిద్ధమౌవుతున్న కేటీఆర్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓ వైపు నేతలు, మరోవైపు కేడర్ వెళ్లిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది కారు పార్టీ. కొత్త కొత్త అస్త్రాలను తెరపైకి తెస్తోంది. లేటెస్ట్‌గా రాష్ట్రమంతా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కేటీఆర్రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతోంది కారు పార్టీ. అధికార పార్టీ నుంచి వస్తున్న మాటల యద్దాన్ని ఎదుర్కోలేక పోతోంది. ఈ క్రమంలో నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయంలో హైకమాండ్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఉద్యమాలతో ప్రత్యేక రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇతర పార్టీల తరహాలోనే అధికార మార్గాలు వెదుకుతున్నట్లుగా కనిపిస్తోంది. పదేళ్లు అధికారాన్ని చెలాయించిన గులాబీ పార్టీ పవర్ కోల్పోయిన తర్వాత..జరుగుతున్న పరిణామాలు..అధికార పార్టీ అరాచకలపై గళమెత్తి ప్రజలకు వినిపిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఆస్క్ కేటీఆర్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే తాను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తం పాదయాత్ర చేపడతానని చెప్పారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్ష మేరకు ప్రజల పక్షాన పోరాడతామన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గులాబీ నేత. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ మొదలుపెట్టిన పాదయాత్రను జగన్, చంద్రబాబు,లోకేష్ఫాలో అయి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో సంపూర్ణ పాదయాత్ర చేసిన నేతలు లేరు. కాబట్టి ఆ పాదయాత్ర కేటీఆర్ చేసి ప్రజలకు దగ్గరవడంతో పాదయాత్ర సెంటిమెంట్ తో పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు కేటీఆర్. ఇటీవల బీఆర్ఎస్ ఏ అంశం ఎత్తుకున్నా బూమరాంగ్ అవుతోంది. కీలక నేతలపై ప్రభుత్వం నుంచి కౌంటర్ ఎటాక్ మొదలవుతోంది. దీన్ని ధీటుగా ఎదుర్కోలేక నేతలు, కేడర్ చెల్లాచెదురవుతోంది. దీన్ని బయటపడాలంటే ఒక్కటే మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే ఉత్తమని భావించింది.తెలంగాణలో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని తిరిగి పొందేందుకు అనేక మార్గాలు వెదుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో సగం ఢీలా పడ్డ గులాబీ దళం..ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా పట్టు నిలుపుకోలేకపోయింది. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నీ విధాలుగా బీఆర్ఎస్ ను ఆపార్టీ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాల్ని అమలు చేయకుండా మోసం చేయడమే కాకుండా ఇవేంటని ప్రశ్నిస్తున్న తమ సోషల్ మీడియా ఆర్మీపై వేధింపులు, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆస్క్ కేటీఆర్ అంటున్నారుపాదయాత్ర ఎప్పటి నుంచి మొదలుపెడతారు అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ అని చెప్పువచ్చు. అధికారంలోరావడానికి నేతలు ఎంచుకునే ఏకైక మార్గం పాదయాత్ర. గతంలో చాలామంది నేతలు ఆ అస్త్రాన్ని ప్రయోగించారు.. సక్సెస్ అయ్యారు.రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం కోలుకోవడం ఇప్పట్లో అయ్యే పని కాదన్నారు. అందుకే తాను ప్రజల పక్షాన కొట్లాడేందుకు ఎంతకైనా తెగిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతతో పాటు హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రజలు ఓడిస్తారని ..కచ్చితంగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు.పాదయాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఓ ట్రెండ్ సెట్. పాదయాత్ర చేస్తే ఆపార్టీ అధికారంలోకి రావడం ఖాయమని..ఆ నేత కీలక పదవి వరిస్తుందనే సెంటిమెంట్ క్రియేట్ అయింది. దీన్ని మొదటగా దివంగత నేత , మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రుజువు చేసి చూపిస్తే ..ఆ తర్వాత చంద్రబాబు, జగన్, లోకేష్ వంటి కీలక నేతలు కూడా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసి తిరిగి పదవులు పొందారు. ఇప్పుడు కేటీఆర్ వ్యూహం కూడా అదే అన్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *