జగ్గారెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
దామగుండం కి భూమి కేటాయించినప్పుడు 9 లక్షల చెట్లు ఉన్నాయని కేటీఆర్ కి ఎందుకు గుర్తు లేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. 9 లక్షల చెట్లు పోతాయి అని తెలిసి ఎందుకు జీవో ఇచ్చినవు. కేటీఆర్…జీఓ లో ఏముందో తెలుసా నీకు. ఎన్ని చెట్లు తీస్తే.. అదే సంఖ్యలో చెట్లు పక్కన నాటాలని ఉంది. ఇదెందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు. పదేళ్లు రాజభోగాలు అనుభవించిన ఆయన.. ఇప్పుడు అవన్నీ దూరం అవ్వడంతో పిచ్చి లేసి మాట్లాడుతున్నారని అన్నారు.
కేటీఆర్..కర్ణాటక ఎన్నికల్లో కుమార స్వామికి డబ్బులు పంపలేదా..? కేజ్రీవాల్ కి పంపింది నువ్వే కదా.. అందుకే మీ చెల్లెల్ని జైల్లో పెట్టింది కదా బీజేపీ. నవీన్ పట్నాయక్ కి ఫండింగ్ చేయలేదా..? నాలుగైదు రాష్ట్రాలకు డబ్బులు ఫండింగ్ చేసిన నువ్వు.. మాపై నిందలు వేయడం ఏంటి..? మేము ఎదురు దాడి చేయడం లేదని తమాషా చేస్తున్నావా..? కేటీఆర్ నాలుకకు నరం లేదు.. బుర్రకి తెలివి లేకా జీఓ ఇచ్చావా అని ప్రశ్నించారు.
బుర్ర పని చేయక జీఓ ఇచ్చావా..? మూసి అక్కడే పుట్టింది అంటున్నావు.. మరి జీఓ ఇచ్చినప్పుడు గుర్తు లేదా మూసి గురించి. కేటీఆర్..వీటికి సమాధానం చెప్పాలి. కేటీఆర్ కి దమాక్ లేకనే ఖతం అయ్యాడని అన్నారు.