సిరా న్యూస్, డిజిటల్
కేసీఆర్ అలా చేసుంటే గెలిచేవాళ్లం… ఓటమిపై కేటీఆర్ కొత్త ట్విట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావం చవిచూసిన బీఆర్‌ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికరంగా స్పందించారు. ఎన్నికల తరువాత తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను క్షుణ్నంగా విశ్లేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ ఓటవిపై సోషల్ మీడియా మాధ్యమాల ద్వార చాలా మంది ఆసక్తికరమైన అనేక అంశాలను లేవనెత్తారని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వార అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన 9ఏండ్ల పాలనలో 32 మెడికల్ కాలేజీలు నిర్మించే బదులు, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు 32 యూ ట్యూబ్ చానళ్లు పెట్టి ఉండాల్సిందని, ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ తనకు బాగా నచ్చిందని ఆయన అన్నారు. ఈ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఇటీవల కాంగ్రేస్ ప్రభుత్వం నీటి పారుదల, విద్యుత్ రంగాలపై అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రాలకు కౌంటర్‌గా కేటీఆర్ స్వేదపత్రం విడుదల సమయంలో కూడ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలనే చెప్పుకొచ్చారు. సోషల్‌మీడియాలో కాంగ్రేస్, బీజేపీ పార్టీలు చేపట్టిన ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో తాము విఫలమయ్యామని, దీంతోనే ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ ట్విట్ వైరల్‌గా మారింది.