లాయర్ ఖర్చు..ఎవరిది…

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల లడ్డు వ్యవహారం యూటర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కోట్లాదిమంది భక్తుల మనోభావాల విషయంలో.. రాష్ట్ర సీఎం గా ఉన్న చంద్రబాబు బాధ్యత రాహిత్యంగా ప్రకటనలు చేస్తే ఎలా అని అర్థం వచ్చేలా తప్పు పట్టింది.ఆధారాలు లేకుండా,సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎలా బయటకు వెల్లడిస్తారని ప్రశ్నించింది. టీటీడీ లడ్డు తయారీకి సంబంధించి..నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ప్రస్తావించారు. అక్కడి నుంచి రచ్చ ప్రారంభమైంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ విచారణ నిలిపివేయాలని, సీబీఐ దర్యాప్తు ఏర్పాటు చేయాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయింది. అయితే టీటీడీ తరుపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర వాదించారు.బలమైన వాదనలు వినిపించారు. ఇఅయితే ఈ కేసులో సిద్ధార్థ లూధ్ర ఎంటర్ కావడం చర్చకు దారితీస్తోంది. గతంలో చంద్రబాబుపై అక్రమ కేసుల్లో వాదనలు వినిపించారు ఆయన.

చంద్రబాబుపై అవినీతి కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులు పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఆ సమయంలో ఆయన ఏసీబీ కోర్టు నుంచి మళ్లీ సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. చివరకు చంద్రబాబుకు బెయిల్ వచ్చేలా చేశారు. అయితే అప్పట్లో సిద్ధార్థ లూధ్ర పెద్ద చర్చకు దారి తీశారు.లూధ్ర సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ లాయర్. ఎన్నో కేసుల్లో విజయం సాధించారు. సక్సెస్ ఫుల్ లాయర్ కావడంతో నిత్యం బిజీగా ఉంటారు. ఒక్కో కేసు విచారణకు లక్షల్లో తీసుకుంటారని ప్రచారం ఉంది. గంటలకు లక్షలు తీసుకుంటారని కూడా టాక్ నడిచింది. దేశంలో ఏ కోర్టులనైనా వాదించేందుకు సిద్ధమని..ప్రత్యేక విమానాల్లో వచ్చి వాదించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఎన్నో రకాల విశ్లేషణలు ఉన్నాయి. అటువంటి సిద్ధార్థ లూధ్ర ఇప్పుడు టిటిడి లడ్డు కేసులో వాదనలు వినిపించడం విశేషం.అప్పట్లో చంద్రబాబు టిడిపి అధినేత. ఓ రాజకీయ పార్టీ నాయకుడు. కచ్చితంగా టిడిపి లాయర్ ఖర్చులు అప్పట్లో భరించి ఉంటుంది. కానీ ఇప్పుడు టీటీడీ లడ్డు వివాదం కేసులో లూధ్ర వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఆయనకు ఫీజు టీటీడీ చెల్లిస్తుందా?లేకుంటే ప్రభుత్వం చెల్లిస్తుందా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. లక్షలాది రూపాయలు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎవరు చెల్లిస్తారో?అన్నది మాత్రం బయటకు తెలియడం లేదు. టీటీడీ చెల్లిస్తే మాత్రం ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *