సిరా న్యూస్, జైనథ్:
మంత్రి సీతక్కను సన్మానించిన ఎంపీపీ, జడ్పిటిసి…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామ్ని గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిలాబాద్ ఇన్చార్జ్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ సీతక్కను అదిలాబాద్ జిల్లా జైనథ్ మండల ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జెడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డిలు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకొని పరిచయం చేసుకున్నారు. వారి వెంట పలువురు నాయకులు, అధికారులు ఉన్నారు.