సిరా న్యూస్,విశాఖపట్నం;
పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విశాఖలో వామపక్షాలు నిరసనకు దిగాయి. దాడులను అరికట్టెల భారత ప్రభుత్వం చొరవ చూపించాలని కోరుతూ కొనసాగిన ర్యాలీలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొని దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు మండిపడ్డారు.రఫా నగరం లోని దాడులు చేసి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దుమ్మెత్తి పోశారు. ఇజ్రాయెల్ మారణకాం డను మోడీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొ డుతూ మోడీ పబ్బం గడుపుకుం టున్నారని, తక్షణమే భారత ప్రభుత్వం స్పందించాలని కోరారు.