పెద్దపల్లి వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆరిఫ్

సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మొహమ్మద్ ఆరిఫ్ అలీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ మస్రత్, ప్రధాన కార్యదర్శిగా ఠాకూర్ బాలాజీ సింగ్, ఉపాధ్యక్షులుగా అజయ్, జాయింట్ సెక్రటరీగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులుగా ఎన్నికైన మొహమ్మద్ ఆరిఫ్ అలీ మాట్లాడుతూ వ్యాన్ ఓనర్స్ కు సమస్యల రాకుండా చర్యలు చేపట్టడంతో పాటు అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పాడుతానని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారికి పలువురు పూలమాలలు వేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *