సిరా న్యూస్, కుందుర్పి
విజయవంతంగా ముగిసిన విలువల బడుల వేసవి శిబిరాలు : ఎస్.కె లెనిన్ బాబు
కుందుర్పి మండలం వ్యాప్తంగా వేసవి సెలవులలో ఏపీసీఓఎస్‌టీ సహకారంతో సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిపిన విలువల బడులు వేసవి శిబిరాలు బుధవారం విజయవంతంగా ముగిసాయని సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎస్.కె లెనిన్ బాబు తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఈ వేసవి శిబిరాలు నడపడానికి సహకరించిన ఏపీసీఓఎస్‌టీ వారికి విద్యార్థుల తల్లిదండ్రులకు, విలువల బడులు ఉపాధ్యాయులకు, వాటిని పర్యవేక్షించిన కోఆర్డినేటర్లకు, ట్రస్టు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ వేసవి శిబిరాలలో విద్యార్థులలో సృజనాత్మకత ,భాషా పరిజ్ఞానం, గణిత పరిజ్ఞానం, నైతికత, పర్యావరణం పట్ల బాధ్యత, సైన్స్ పట్ల అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు తమ చిట్టి చేతులతో లక్ష 50 వేలకు పైగా విత్తన బంతులను తయారుచేసి వారి చేతులమీదుగా ప్రపంచ పర్యావరణ దినం పురస్కరించుకొని జూన్ 5వ తేదీన విత్తన బంతులను అన్ని విలువల బడుల విద్యార్థులు నాటారని, అలాగే మంచి ఫలితాలు రాబట్టారని తెలిపారు.