సిరా న్యూస్,తిరుమల;
తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ , ఆంధ్ర నాకు రెండు కళ్ళు అన్న చంద్రబాబు నాయుడు, . ఇప్పుడు ఒక కన్ను పొడిచేసుకొన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లను తిరుమలలో అనుమతించనప్పుడు, తెలంగాణలో మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఫోన్ చేస్తే ప్రత్యేక దర్శనాలు ఎందుకు ఏర్పాటు చేయాలని నిలదీసారు. మా లెటర్లు అనుమతిస్తారా…?? లేక మేము అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలా అని అన్నారు. కేవలం వ్యాపారం చేసుకోవడానికే మా ప్రాంతాన్ని వాడుకొంటారా అని మండిపడ్డారు.