సిరా న్యూస్,అమలాపురం;
ఇటీవల ఎల్ఐసి పాలసీలలో మరియు ఏజెంట్ కమీషన్ స్ట్రక్చర్ లో తీసుకువచ్చిన మార్పులకు నిరసనగా ఎల్ఐసి ఆల్ ఇండియా ఏజెంట్ల ఫెడరేషన్ పిలుపు మేరకు అమలాపురంలో ఏజెంట్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఏజెంట్లు మాట్లాడుతూ ఎల్ఐసి లో తీసుకువచ్చిన మార్పుల వలన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలసీలు దూరం చేయడం జరిగిందన్నారు. వయోపరిమితి తగ్గించడం వలన పేద, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఎల్ఐసి పాలసీలకు దూరమయ్యారన్నారు. ఎల్ఐసి పై ఆధారపడి బతుకున్న ఏజెంట్ల కమీషన్ తగ్గించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి, ఐ.ఆర్.డి.ఎ.ఐ నిర్ణయాలలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఏజెంట్లు కోరారు.