మహిళా సంఘా ఐక్య వేదిక
సిరా న్యూస్,విశాఖపట్నం;
నూతన మద్యం పాలసీ ని రద్దు చేయాలనీ కోరుతూ విశాఖ లో మహిళా సంఘాల ఐక్య వేదిక ధర్నా చేపట్టింది.జీవీఎంసీ వద్ద ధర్నాకు దిగిన ఐక్య వేదిక సభ్యులు మద్యం పాలసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మద్యపానం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని ఆందోళన వ్యక్తంచేశా రు. అన్ని అనర్థాకలు కారణమైన మద్యా న్ని నిషేధించకపోగా మరిం త ఎక్కువ ఆదాయం వచ్చేలా దుకాణాలు పెంచటం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మద్యం షాపులు పెంచటం, ప్రైవే టు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వడం, లైసెన్సు ఫీజుల ద్వారా ప్రభుత్వాని కి రెండు వేల కోట్ల ఆదాయం వస్తోం దని, మద్యమే ప్రధాన ఆదాయవన రుగా భావిస్తూ పేదల జీవితాల్లో ప్రభుత్వం మరింత చీకటి నింపు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపాలని, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకే షాపులకు అనుమతివ్వాలని సూచిం చారు.