సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ కాలనీ లో గల ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పాఠశాలలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు పాఠశాల గేటు, డోరు తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలో గల ల్యాప్టాప్ తో పాటు విద్యార్థులు కూడా పెట్టుకున్న వెయ్యి రూపాయల నగదును దొంగలించుకుని పారిపోయారు, పాఠశాలలోని సీలింగ్ ఫ్యాన్ లను సైతం దొంగిలించడానికి ప్రయత్నం చేయగా వీలు కాక పోవడంతో ఉడాయించారు.
ఉదయం పూట పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగలగొట్టి ఉండడాన్ని చూసి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు, దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు