సీఎం చంద్రబాబుకు రఘురామ లేఖ
సిరా న్యూస్,విజయవాడ;
సాక్షులను బెదిరిస్తున్న సీఐడీ మాజీ చీఫ్ను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ మేరకు అయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాసారు.
తనపై టార్చర్ కేసులో సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను సునీల్ బెదిరిస్తున్నారంటూ అయన ఆరోపించారు. సునీల్కుమార్పై జులై 11న పట్టాభిపురం పీఎస్లో హత్యాయత్నం కేసు నమోదైనట్లు వెల్లడించారు. సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్కుమార్ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కోరారు.