రెండు నెలల లోపు ఉచిత ఇసుక అమలు
సిరా న్యూస్,పెనమలూరు;
ఏపీఎండిసీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ ఏ రాష్ట్రం లో లేని విధం గా గవర్నమెంట్ తీసుకు అన్ని మొత్తం బ్రష్టుపట్టించారు. చాలా పక్కడబందిగా చాలా ట్రాన్సపరెంట్ గా చేసాము. 89882 మంది అప్లై చెయ్యడం ఇది ఫస్ట్ టైం. ఒక్కో షాప్ కు సగటున 25 మంది వేశారు. ప్రభుత్వానికి 1798 కోట్లు ఆదాయం వచ్చింది .మోనోపోలి కి రాజకీయాలుకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 16 నుండి సేల్స్ స్టార్ట్ చెయ్యడం జరుగుతుంది. అప్లై చేసిన వారు కూడా అందరు పద్దతిగా వ్యవహారించారు. సహకరించిన అన్ని శాఖ ల అధికారులకు ధన్యవాదాలని అన్నారు. సబ్ కమిటీ ఇచ్చిన సలహాలు కూడా చాలా విలువైనవి. ఎమ్ ఆర్ పి కి మించి అమ్మడానికి లేదు. నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. మహిళలు వ్యాపార రంగం లో ముందుకు వెళ్ళాలి వాళ్ళు పాల్గొనడం సంతోషం. మార్నింగ్ 10 నుండి సాయంత్రం 10 వరకూ సేల్స్ జరుగుతాయి.
ఎన్ఫోర్స్మెంట్ ను స్ట్రిక్ట్ చేసాము . కొత్త బ్రాండ్స్ కు టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటాము. జగన్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళించ్చినట్టు వున్నాయి. గతం లో విచ్చలవిడిగా ఇసుక ని సొమ్ము చేసుకుంది జగన్ సర్కార్. ఎన్ జి టి నామ్స్ పాటించకుండా ఉండడం వల్ల అనేక కేసులు అయ్యాయి. అసలు జగన్ సర్కార్ లో ఎంత ఇసుక తీశారు విక్రయలు తదితర లెక్కలే అసలు లేవని అన్నారు. వైసీపీ చేసిన ఈ వ్యతిరేక పనుల వల్ల ప్రజలకు భారం పడింది. 108 రీచ్ లను గుర్తించాం. ఈ నెల 16 న 40 రీచ్ లను ఓపెన్ చెయ్యడానికి సిద్ధం గా వున్నాం. రాబోయే 2 నెలల లోపే ఫ్రీ సాండ్ అందుబాటులోకి వస్తుంది. అక్రమం గా తరలించే 40 వెహికల్స్ సీజ్ చేసాం. ప్రైవేట్ రెచ్చేస్ ని గుర్తించి త్వరలో వాటి పైన క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.