సిరాన్యూస్, బోథ్
లోకమాన్య గణేష్ మండలి యూత్ సభ్యులకి సన్మానం
నాడు హిందువులలో ఐక్యత కోసం పూణే నగరంలో బాలగంగాధర్ తిలక్ 1893 సంవత్సరంలో మొదటి సారిగా వినాయక ఉత్సవాలను ప్రారంభించారు. వారి పేరు మీదనే లో బోథ్ మండల కేంద్రంలో లోకమాన్య యూత్ గణేష్ మండలి ఏర్పాటు చేసుకొని 16 సంవత్సరాలు పూర్తయింది.నాటి నుండి నేటి వరకు మట్టి గణపయ్య నే పూజిస్తూ సనాతన సాంప్రదాయాలని కొనసాగిస్తూ,నియమాలతో నిత్యపూజలు చేస్తూ భక్తి పాటలతో గణపతి నిమజ్జనాన్ని పూర్తి చేయడంతో స్థానిక కాలనీ ప్రజలు వారిని సన్మానించడం జరిగింది. పర్యావరణహితమైన గణపతిని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోథ్ పట్టణ పురవీధుల్లో వినాయక శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది.స్థానిక ప్రజలు మాట్లాడుతూ లోకమాన్య యూత్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడ్డారు అని వారిని కాలనీ వాసులు సన్మానించారు.