నెహ్రూబజార్ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన లోకేష్

సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖపట్నం నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని సందర్శించిన లోకేష్… కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఎబిసిడి లు, రైమ్స్ వచ్చా అని అడగ్గా… వారు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరాతీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి లోకేష్ ఫోటో దిగారు.
గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ 
అంతకుముందు నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ… 9.45 గంటలకు కూడా మూసివేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *