సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో.. హైదారాబాద్-విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దాంతో లారీ డీజిల్ ట్యాంక్ పగిలింది. క్షణాల్లో మంటల్లో సిమెంట్ లోడ్ లారీ దహనమయింది. కాలిపోతున్న లారీ నుంచి డ్రైవర్ బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం అని అనుమానిస్తున్నారు. ఘటనతో హైదరాబాద్ -విజయవాడ హైవే పై ట్రాఫిక్ స్థంభించింది.