– రాష్ట్ర అధ్యక్షులు అంజిరెడ్డి
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
రాష్ట్రంలో లారీ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రప్రభుత్వం పరిష్కరించా లని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సి. అంజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి లారీ అసోసియేషన్ కార్యాలయంలోరాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్క్రాప్ పాలసీ, క్వార్టర్లీ టాక్స్ మాఫీ, సింగిల్ పర్మిట్, లోకల్ లారీలకు ఇన్స్యూరెన్స్ రుసుం తగ్గింపు, 15 ఏళ్లు దాటిన కార్తీక ఫిట్ నెస్ ఫీజు తగ్గింపు, తదితరఅంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించుకునే వరకు లారీ ఓనర్స్ ఐక్యంగా కదలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసోసియేషన్ ఛైర్మన్ రామినేని శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పెద్దపల్లి లారీ ఓనర్స్ అద్యక్షులు షేక్ అబ్దుల్ భారీ, కార్యదర్శి బూత్కూరి తిరుపతి, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఎండి
జహంగీర్, కోశాధికారి ఎండి అఫ్జల్, రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.