– రెండు లక్షల చెక్కును అందజేసిన లూపిన్ హెచ్‌ఆర్ డీజీఎం శ్రీనివాసరావు
సిరా న్యూస్,పరవాడ;
ఇటీవల తుఫాను విపత్తుకి విజయవాడ పరిసర ప్రాంతాలు జలమయం అవ్వడమే కాకుండా తీవ్ర పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. వరద బాధితుల సహాయనిధికి లుపిన్ ఫార్మా కంపెనీ 2 లక్షల రూపాయల చెక్కును శివశంకర్ రెడ్డి జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ వారికి ఎన్ శ్రీనివాసరావు లూపిన్ డీజీఎం హెచ్‌ఆర్ అందజేశారు. ముఖ్యమంత్రి,జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు వరద బాధితుల సహాయ నిధికి ఈ ఆర్థిక సహాయం సామాజిక బాధ్యతలో భాగంగా అందజేయడం జరిగిందని ఎన్ శ్రీనివాసరావు డీజీఎం హెచ్‌ఆర్ పేర్కొన్నారు. విపత్తు నుండి విజయవాడ పరిసర ప్రాంతాలు త్వరగా కోలుకోవాలని యధాస్థితికి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో జెవివిస్ నారాయణ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఫాక్టోరీస్ , పి చిన్నారావు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టోరీస్, లుపిన్ ఫార్మా కంపెనీ నుండీ స్ అప్పారావు, సేఫ్టీ మేనేజర్, కేదార మల్లా , ఫైనాన్స్ మేనేజర్ , డి వెంకట నారాయణ సీస్సార్ మేనేజర్ పాల్గొన్నారు.