సిరా న్యూస్, కరీంనగర్:
తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికే మహాలక్ష్మి పథకం వర్తింప చేయాలి…
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి పరిమితం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ బాధ్యులు సాధన, జిల్లా కమిటీ బాధ్యులు నాగరాజ్ లు డిమాండ్ చేశారు. గురువారం చొప్పదండి మండల తహసిల్దార్ ను కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలతో పాటు పురుషులకు సైతం మహాలక్ష్మి పథకాన్ని వర్తింప చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఈ పథకం నుండి మినహించాలని కోరారు. మహాలక్ష్మి పథకం వల్ల రోడ్డున పడ్డ వేల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం వారికి నెలకు రూ. 3వేల జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చొప్పదండి మండల కమిటీ బాధ్యులు గజ్జల శేఖర్, నాయకులు వంశీ, కుమార్, ఇతర స్థానిక మహిళలు పాల్గొన్నారు.