సిరా న్యూస్,ధర్మపురి;
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నియోజక వర్గస్థాయి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు కొప్పులను పట్టుకుని బోరున విలపించారు… కన్నీరు ఆపుకోలేని కొప్పుల సైతం కంటతడి పెట్టుకున్నారు…ఈశ్వర్ మాట్లాడుతూ తన ఓటమికి కారణం రెండే రెండు ప్రత్యర్థి పై సానుభూతి అని, గెలుపు ఓటములు సహజమని, కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పారు…అందరూ కలిసికట్టుగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని తెలిపారు…