సిరా న్యూస్,మంథని;
నేటి డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంథని బస్ డిపో మేనేజర్ వి. శ్రావణ్ కుమార్ కోరారు. మంథని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మంథని డిపో పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్న, సలహాలు సూచనలు అందించేందుకు మంగళవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఫోన్ నెంబర్ 7382825923 లో సంప్రదించాలని డిఎం కోరారు.