సిరాన్యూస్, ఆదిలాబాద్
ఈనెల 10న అఖిల భారతీయ మాలి మహా సంఘం సమావేశం : సుకుమార్ పెట్కులే
మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆలస్యాన్ని గురించి చర్చించడానికి ఈనెల 10న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల ఫూలే గెస్ట్ హౌస్ లో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే తెలిపారు. సభ్యులందరూ సకాలంలో హాజరై భవిష్యత్ కార్యాచరణ పై చర్చించాలన్నారు.సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.