Malla Reddy: సీనియర్ అసిస్టెంట్ సాయిలు డిప్యూటేషన్ రద్దు చేయాలి…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

సీనియర్ అసిస్టెంట్ సాయిలు డిప్యూటేషన్ రద్దు చేయాలి…

అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సాయిలుకు ఇటీవలే ఆదిలాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో డిప్యూటేషన్ ఇవ్వడం జరిగిందని, ఈ డిప్యూటేషన్ ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. సీనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్ వలన మండల వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వెంటనే ఈ డిప్యూటేషన్ రద్దుచేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *