సిరా న్యూస్, బోథ్
బీసీ కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
* మాజీ ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్
* కుల సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి
రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన జరిపిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఆత్మ చైర్మన్ మల్లెపూల సుభాష్ అన్నారు. మంగళవారం విశ్వ కర్మ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, మున్నూరు కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల తహసీల్దార్ సుభాష్ చంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ బీసీ కుల గణన జరగకముందు ఎన్నికల నిర్వహిస్తే బీసీలు నష్టపోతారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, మున్నూరు కాపు సంఘం నాయకులు, నాయకులు నాయి బ్రాహ్మణ సంఘం టౌన్ ప్రెసిడెంట్ నవీన్, రజక సంఘం జనరల్ సెక్రెటరీ రమణ, ముదిరాజ్ ,సంఘం నాయకులు మహేందర్ బీసీ సంఘాల నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.