Mandal Special Officer Manohar: నవంబర్ నుండి సమగ్ర సర్వే మండల ప్రత్యేక అధికారి మనోహర్

సిరా న్యూస్, బేల‌
నవంబర్ నుండి సమగ్ర సర్వే మండల ప్రత్యేక అధికారి మనోహర్

బేల మండలంలో నవంబర్ నుండి సమగ్ర సర్వే నిర్వ‌హిస్తామ‌ని మండల ప్రత్యేక అధికారి మనోహర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా
బేల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని చేపట్టడానికి బుధవారం రోజు గ్రామ పంచాయతీ లో ఉన్నట్టు వంటి పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశవర్కర్, బి.ఎల్.ఓ సిబ్బందికీ ఒక రోజు మాస్టర్ ట్రైనార్లతో శిక్షణ ఇచ్చారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని ఏవిదంగా నమోదు చేయాలి, కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు మొదలగు అంశాలపైన ప్రోజెక్టర్ ద్వారా అవగాహనా కల్పించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీవో శిక్షణ కార్యక్రమని పరిశీలించారు. ఈ సందర్బంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 110 ఎన్యూమరేటర్లను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. నవంబర్ ఆరు నుండి పదిహేను రోజుల పాటు సర్వే చేపట్టిన తర్వాత మండల కేంద్రంలో కంప్యూటీకరణ చేయడం జరుగుతుందని అని అన్నారు. మండలంలో దాదాపుగా పదివేల రెండు వందల ముప్పై ఎనిమిది కుటుంబాలకు సమగ్ర సర్వే చేపట్టడం జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *