-నూతన కార్యవర్గ ఎన్నికకు త్వరలోనే తేదీ ప్రకటిస్తాం
-ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నల్మాసు ప్రభాకర్
సిరా న్యూస్,మంథని;
మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్ తో పాటు కార్యవర్గం మొత్తం గతంలో రాజీనామా చేయగా ఈ రాజీనామాలను ఆమోదించినట్లు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నల్మాసు ప్రభాకర్ ప్రకటించారు. మంథని పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మహాసభ కార్యదర్శి కొమురవెల్లి విజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు నల్మాసు ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్మాసు ప్రభాకర్ మాట్లాడుతూ మంథని పట్టణ కార్యవర్గాన్ని వారి విన్నపం మేరకే రాజీనామాలను ఆమోదించామని ఇట్టి ఆమోదించిన రాజీనామా పత్రాలను రాష్ట్ర మహాసభకు పంపించి త్వరలోనే మంథని పట్టణ ఎన్నికలు నిర్వహించేందుకు తేదీని ప్రకటించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు ఓల్లాల సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు ముస్త్యాల దామోదర్, కొత్త శ్రీనివాస్, ఎల్లంకి వంశీ, ఒల్లాల నాగరాజు, రావికంటి మనోహర్, చందా ఈశ్వర్, రాచర్ల నాగరాజు, బజ్జురి ప్రవీణ్, కొమురవెల్లి రాజు, ఎల్లంకి కేదారి, కొమురవెల్లి దత్తు, రావికంటి చందు, మణికంఠ ప్రకాష్, దొంతుల మేఘశ్యామ్, కొమురవెల్లి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Khali Streitt