సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సత్తుపల్లి పట్టణంలో జరిగింది.సత్తుపల్లి జవహర్ నగర్ లో బి.రిషి,సంజన దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వీరి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంజన… జవహర్ నగర్ కు పక్కనే ఉన్న తామరచెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తామర చెరువుకు సమీపంలోనే ఉన్న కొందరు 100 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను చెరువులో నుంచి బయటికి లాగి, పోలీసు వాహనంలో సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.