సిరాన్యూస్, ఓదెల
ఈనెల 4 న మీసేవ ఆవిర్భావ సభ : ఆర్గనైజింగ్ సెక్రటరీ నగునూరి శ్రీనివాస్
మీసేవ సమస్యల పరిష్కారమే లక్ష్యం గా ఈ నెల 4 న హైదరాబాద్ లోని ఆర్ టీ సి కళాభవన్ లో నిర్వహిస్తున్న మీసేవ ఆవిర్భావ సభకు పెద్దపల్లి జిల్లాలోని ప్రతి మీసేవ నిర్వాహకులు హాజరై సభను విజయవంతం చేయాలని తెలంగాణ మీసేవ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నగునూరి శ్రీనివాస్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ ఈ ఆవిర్భావ సభకు రాష్ట్ర ఐ.టీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా, టీ జి టీ యస్ చైర్మన్,ఈ యస్ డీ కమిషనర్ ,టీ యస్ ఆన్లైన్,టీ జి టీ యస్ అధికారులు హాజరవుతున్నట్లు తెలిపారు. గత 13 సంవత్సరాలుగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు.తమ ప్రధాన డిమాండ్ లైన కమిషన్ పెంపు, ఉచిత ఇంటర్నెట్, కరెంటు, స్టేషనరీ ,ఆరోగ్య భద్రత కార్డులు, సర్వీస్ ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం జేశారు.సోమ వారం మీటింగ్ ఉన్నందున అధికారులు, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.