సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా వలమాడపేట మండలం ఎఏం పురంలో దారుణం జరిగింది. మూడున్నర ఏళ్ల బాలికకు ఒక యువకుడు చాక్లెట్లు ఆశ చూపి అత్యాచారయత్నం చేసాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో హత్య చేసి పాతిపెట్టాడు. పాప కనిపించడం లేదని పోలీసులకు కుటుంబ సభ్యులు పిర్యాదు చేసారు. అనుమనాంతో పోలీసులు నిందితుడు సుశాంత్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కలెక్టర్కు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు.
మరోవైపు, బాధిత కుటుంబాన్ని వైకాపా నేతలు రోజా, భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. ఇలాంటి ఘటనలు జరిగితే పవన్ తొక్కి నార తీస్తానన్నారు. త మందిని తొక్కి నార తీశారో పవన్ చెప్పాలి. మత్తుపదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. 4 నెలల్లో వందకుపైగా అఘాయిత్యాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.