సిరా న్యూస్;
రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4వ తేదీ నుంచి రాష్ట్రంలో కుల ఘనన ప్రక్రియ చేపట్టాలని అందు కోసం 80 వేల మంది ఉద్యోగులను కేటాయించి తగిన విధంగా ముందుకు పోతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో లోతుగా చర్చించి పార్టీ పరంగా దీనిపై ఒక కార్యాచరణ తీస్కోవాలని నిర్ణయించడం జరిగింది. అందువల్ల పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ నెల 30న బుధవారం నాడు ఉదయం 10.30 గంటలకు మంత్రులు, సలహాదారులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, విప్ లు, కార్పొరేషన్ చైర్మన్ లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు.