సిరా న్యూస్,శ్రీశైలం;
ప్రముఖ శైవ క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి నీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున మంత్రి దామోదర్ రాజనర్సింహ తన కుటుంబ సభ్యులతో దేవస్థానం కి చేరుకోగానే ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం, స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో తులాభారం లో తన బరువుకు సరిసమానమైన బెల్లంను స్వామివారికి సమర్పించుకున్నారు. ఆలయ అర్చకులు ఇచ్చిన పలహారాలను స్వీకరించారు.