డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్ లో ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్ గైర్హాజరు అయ్యారు. పటాన్ చెరు కాంగ్రెస్ లో కొత్త, పాత పార్టీ నాయకులు కలిసుండలేకపొతున్నారు. ఎమ్మెల్యే గైర్హాజరవడంపై సమగ్ర సర్వేలో చర్చ మొదలయింది.