సిరా న్యూస్,శంషాబాద్;
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయంలో దేవుళ్ళ విగ్రహాల ధ్వంసం ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ శివారు శంషాబాద్ లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తో పాటు వివిధ రాజకీయ పార్టీలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఘటనలు నిరసిస్తూ పార్టీలకు అతీతంగా హిందుత్వాదులంతా కాషాయం జండాలు పట్టుకొని శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి నిరసన ప్రదర్శన చేపట్టారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. శంషాబాద్ లోని వివిధ ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. మరోవైపు వ్యాపార, వాణిజ్య రంగ సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. హనుమాన్ దేవాలయ ఘటన నిరసిస్తూ పార్టీలకు అతీతంగా హిందుత్వవాదులంతా భారీ ర్యాలీ చేపట్టడంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ పర్యవేక్షణలో పోలీసులు ఎక్కడికి అక్కడ పికెట్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు.