పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించండి..

జమ్మికుంట శాఖ అధ్యక్షులు గరిగ చంద్రయ్య డిమాండ్..
సిరా న్యూస్,జమ్మికుంట;
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, ఎస్ టి ఓ ,జమ్మికుంట శాఖ అధ్యక్షులు గరిగచంద్రయ్య ఆధ్వర్యంలో బుధవారం రోజు స్థానిక ఎస్ టి ఓ జమ్మికుంట కార్యాలయం ముందు టా, ప్ర, రాష్ట్రశాఖ ఆదేశానుసారము పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎస్ టి ఓ, కూనమల్ల సుమన్ కుమార్, కు మెమోరాండం ఇచ్చారు, అనంతరము ఇట్టి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న టా,ప్రా, కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, గౌరవాధ్యక్షులు కట్ట నాగభూషణాచారి, మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డి ఏ లను వెంటనే ప్రకటిస్తూ రెండవ పిఆర్సి ని ప్రకటించి జూలై 2023 నుండి అమలుపరచాలని ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్, విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అదేవిధంగా అర్హత కలిగిన ఈపిఎస్ పెన్షనర్లకు పెన్షన్ మంజూరు చేయాలని పెన్షనర్ల కమ్యూటేషన్ తగ్గింపును 15 సంవత్సరముల నుండి 12 సంవత్సరములకు కుదించి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేస్తూ పెన్షనర్లకు కూడా ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు, ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఈ హెచ్ ఎస్, స్కీం అమలుపరుస్తూ గ్రాట్యుటీ 20 లక్షలకు పెంచుతూ పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ 3000 రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు, ఈ ధర్నా కార్యక్రమంలో జమ్మికుంట శాఖ గౌరవ అధ్యక్షులు శీలం మల్లేశం, కూతాడి ప్రభాకర్,ఎండి హసన్, ఎస్ సారభద్రస్వామి, జె రామచంద్రం, భోగం రాజయ్య, ఖాజా మొయినుద్దీన్, జె దేవయ్య, తదితరులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *