సిరా న్యూస్,సిద్దిపేట;
హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట్ మండలం చౌటపల్లి లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్థల పరిశీలన చేసారు. మంత్రి వెంట పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి,టీజీఐఐసీ ఎండీ విష్ణు వర్ధన్ రెడ్డి ,సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తదితరులు వున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో అక్కన్నపేట మండలం చౌటపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం స్థల పరిశీలన జరిగింది. స్థల సేకరణ పూర్తి చేసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కి త్వరగా అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ,ఎమ్మార్వో ఇతర అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు..