సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పాలడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నతమైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చావ శ్రీనివాస రావు విద్యార్థినిల పట్ల అసభ్య ప్రవర్తన బయటపడింది. విద్యార్థినిల తల్లిదండ్రుల రావడంతో అయన పాఠశాలను వదిలి పారిపోయాడు. విద్యార్థులపై తరచుగా చేతులు వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పడంతో పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. చావా శ్రీనివాసరావు పై చర్య తీసుకోవాలంటూ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.