సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
వృద్దులు, వికలాంగులు, వితంతువులు వారి అవసరాలను గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఒకటో తారీకునే పెంచిన ఎన్టీఆర్ భరోసా భద్రత పింఛను మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గురువారం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగాఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలను ఐదేళ్లకు పెంచారాని, కానీ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఒకే సారి 4000 రూపాయలకు పెంచి ఇంటి లబ్ధిదారులకు ఇంటి వద్దకే ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానిది, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కుతుందన్నారు.