సిరాన్యూస్,కళ్యాణదుర్గం
చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు పంపిణీ: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద నిరుపేద చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. దాదాపుగా రెండు లక్షలు విలువచేసే 10 తోపుడుబండ్లను అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ కాలనీ విధుల్లో ప్రధాన రహదారులు మీదుగా న తిరిగే చిరు వ్యాపారస్తులు ప్రతి రోజు తోపుడు బండ్లను అద్దెకు తీసుకుని వ్యాపారం కొనసాగించే వారన్నారు. అందుకోసమే వారందరికీ ఉచితంగా తోపుడు బండ్లను ఇచ్చి వారిని ఆదుకోవాలని ఉద్దేశం తోనే పంపిణీ చేశామన్నారు. సీఎం చంద్రబాబు ఆశయ సాధన పూర్ టు రిచ్ లో భాగంగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అంద చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.