సిరా న్యూస్, ఇచ్చోడ:
బోథ్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విఠలేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఇచ్చోడ చేరుకున్న ఆయన మండల కేంద్రంలోని విఠలేశర్వన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అర్చన గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, స్థానికులు ఉన్నారు.