సిరాన్యూస్, సామర్లకోట
స్వామీజీ ఆశీర్వాదాలు పొందిన ఎమ్మెల్యే చిన్నరాజప్ప
గణపతి నవరాత్రులు సందర్భంగా సామర్లకోట మండలంలో గణపతి ఆలయాల్లో జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు)లు పాల్గొని ప్రారంభించారు. స్థానిక అయిదు తూముల వద్దగల హరిహర క్షేత్రం అయిన శ్రీ అన్నపూర్ణ సమేత రామ లింగేశ్వర స్వామి ఆలయంలోని గణపతి ఆలయంలో జరిగిన అన్నదానం కార్యక్రమం వారు ప్రారంభించారు. అలాగే ఆలయ స్వామీజీ అయిన పరమానంద గిరి స్వామి వద్ద ఆశీర్వాదాలు పొందారు. అలాగే మెహర్ కాంప్లెక్స్ లోని లక్ష్మి గణపతి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే రాజప్ప, జిల్లా అధ్యక్షులు బాబులు పాల్గొన్నారు. అలాగే పలు గణపతి మండపాలను వారు సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో తెదేపా నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, బలుసు వాసు, వల్లూరి దొరబాబు, గోల్తి సత్యనారాయణ, కంటే జగదీశ్, జనసేన నాయకులు సరోజ వాసు, ఆలయ కమిటీ ల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.