చెన్నాపురం గ్రామ అభివృద్ధికి రూ.1.07 కోట్లు నిధులు మంజూరు…
సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా, దత్తత గ్రామమైన అశ్వారావుపేట మండలం చెన్నాపురం మారుమూల గిరిజన గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి,వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి పథకాలకు మొదలు పెట్టే క్రమంలో వారం రోజులు గడవక ముందే చెన్నాపురం గ్రామ అభివృద్ధికి రూ.1.07 కోట్లు నిధులు మంజూరు చేయించారు. బుధవారం ఆయన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి సి సి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నాపురం గ్రామా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని సంకల్పించిన ఎమ్మెల్యే, ప్రత్యేకంగా సి సి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం వంటి మౌలిక వసతులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మొదటగా చెన్నాపురం గ్రా మంలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలను గమనించి తగిననివేదిక అందించాలని సూచించారు. ఈ విధంగా గ్రామాన్నిదత్తతతీసుకుని, వెంటనే అభివృద్ధి పనులు ప్రారం భించడం ద్వారా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అందరికీ ఆదర్శంగా నిలిచారు.ఆయన చర్యలు గ్రామస్తులకు ఆశా భావం కలిగించాయి. ఈ కార్యక్రమంలోమండల, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు,గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు